పాత పెన్షన్ పద్ధతినే కొనసాగించాలి…
టిబిఇసిసి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్

మనన్యూస్,తిరుపతి:అన్ని జాతీయ బ్యాంకులలో ఔట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,బ్యాంకుల్లో ఏళ్ల తరబడి పరిష్కారానికి నేర్చుకొని పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి జే ధన్వంత కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ లపిలుపుమేరకు తీపి ఏరియాలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎదుట పలువురు బ్యాంక్ ఉద్యోగులు నిరసన చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ధన్వంత్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాది ఐ బి ఏ యూనియన్ నాయకుల ఒప్పందం ప్రకారం 15 రోజులలో తమ డిమాండ్లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బ్యాంకులలో అన్ని క్యాడర్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.వారానికి ఐదు రోజులే పని దినాలు కల్పించాలని,పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.అనంతరం యు ఎఫ్ బి యు కన్వీనర్ విజయభాస్కర్ మాట్లాడుతూ గత ఏడాది ఐబీఏ యూనియన్ నాయకులతో ఒప్పందం జరిగినప్పటికీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడం దారుణమన్నారు.ఇప్పటికైనా బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విజయ్ భాస్కర్ హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో జనార్దన్ భాస్కర్ కేశవరెడ్డి,సుమలత రేష్మ,నిర్మల,వెంకటలక్ష్మి మహేష్ మహేష్ బాబు నందకుమార్ పవన్,శంకర్రావు లక్ష్మీపతి నటరాజ్ వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *