మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ జిల్లా,గొల్లప్రోలు మండలం,దుర్గాడ గ్రామంలో పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున మాఘ పౌర్ణమి బుధవారం సందర్భంగా శ్రీ లలితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,దత్తుసోదరులు పంచామృతాలు,హారిద్ర, కుంకుమ,సుగంధ జలాలుతో అభిషేక నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ శ్రీ సూక్త దుర్గాసూక్త,సహస్రనామ పారాయణ.చేసి నీరాజన మంత్ర పుష్పములు సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ రాజగోపురంపై,ధ్వజస్తంభంపై.కనిపించిన చంద్ర దర్శనం భక్తులు ఆకట్టుకున్నది.ఆలయ సేవాసభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *