

Mana News, వంగర ఫిబ్రవరి 13:- మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పటికీ సరస్వతీపుత్రుడు అనిపించుకున్న కొల్లి చరణ్ ప్రతిభ ఇది. వంగర మండలం జే కే గుమ్మడ గ్రామానికి చెందిన చరణ్ ఇటీవల జరిగిన జేఈఈ(మెయిన్స్) లో98 శాతం మార్పులు సాధించి ప్రతిభ కనబరిచారు. వివరాల్లోకి వెళ్తే చరణ్ nta స్కోర్ పరిశీలిస్తే భౌతిక శాస్త్రంలో 98.4 శాతం, రసాయన శాస్త్రంలో 97.5 శాతం గణితంలో 97.89 శాతం మార్పులు సాధించడం విశేషం ఈయన సామాన్యమైన వ్యవసాయ కుటుంబానికి చెందిన కొల్లి తిరుపతిరావు గీత దంపతుల రెండవ కుమారుడు ,చదువులో ప్రతిభకనపరిచిన చరణ్ ను గ్రామస్తులు, విద్యార్థికులు అభినందిస్తున్నారు.