

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం కు చెందిన స్పార్క్ సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్ సంస్థ చైర్మన్ ఎస్ సాయి సందీప్ కు ఆదివారం రాజమండ్రిలో సితార గ్రాండ్స్ ఫంక్షన్ హాల్ నందు (ఎం ఎస్ టి ) విశిష్ట సేవరత్న పురస్కారం 2025 ను ప్రముఖులు ట్రస్ట్ ఫౌండర మేడిది వెంకటేశ్వరరావు గారు అందజేశారు ,ఇప్పటికే స్పార్క్ సాంకేతిక పరిజ్ఞానంపై మారుముల ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాలపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి అందరికీ అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాల నుండి ఎలా రక్షించుకోవాలో అనే అంశాలపై వర్క్ షాపులు సెమినార్లు నిర్వహించి పోలీస్ శాఖతోపాటు వివిధ శాఖలతో సమాజం కోసం కలిసి పని చేస్తున్నారు అని, సాయి సందీప్ గారు చేస్తున్న ఈ సామాజిక సేవా కార్యక్రమాలును చూసి గుర్తించి మేడిది సుబ్బయ్య ట్రస్ట్ వారు ఘనంగా విశిష్ట సేవారత్న పురస్కారాన్ని అందజేశారు వారు మాట్లాడుతూ వయసులో చిన్న వారైనా చేసే కార్యక్రమాలు చాలా పెద్దవని ఇప్పుడు ఉన్న యువత సాయి సందీప్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రశంసించారు, ఈ స్పార్క్ బృందం సైన్స్ అండ్ టెక్నాలజీ పై చాలా కార్యక్రమాలు నిర్వహించి మూఢనమ్మకాలను తరిమికొట్టడానికి నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎక్కడ లేని విధంగా నిర్వహిస్తారు అని, విశ్వవిద్యాలయాలులో మరియు కళాశాలలో చాలా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను సాంకేతికంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు అని ,వీరు చేసే ప్రతి కార్యక్రమం సమాజానికి చాలా ఉపయోగపడుతుందని ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేసి స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ గారికి చాలా అవార్డులు ప్రశంసలు అందుకున్నారని ఈ విశిష్ట సేవారత్న పురస్కారంతో ఇతన్ని పురస్కరించుకోవడం మా ట్రస్ట్ యొక్క అదృష్టమని సాయి సందీప్ గారు లాంటి వారు అరుదుగా ఉంటారని ఇలాంటి వారు మన మధ్యలో ఉండడం చాలా అదృష్టం అని మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సమాజానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని వక్తలు కొనియాడారు,ఈ సందర్భంగా సాయి సందీప్ మాట్లాడుతూ తల్లిదండ్రులే నాకు ఆదర్శమని వారి ప్రోత్సాహంతోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని మా స్పార్క్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి మాకు ఈ పురస్కారం ఇవ్వడం చాలా ఆనందకరమని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు