

కాణిపాకం ఫిబ్రవరి 02 మన న్యూస్
చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చంద్రప్రభ ఉభయ దారులు అందరూ కలిసి ఈరోజు దళిత సత్ర సాధన కొరకు అగరంపల్లి హైస్కూల్ మైదానం నందు బహిరంగ సభ ఏర్పాటు చేశారు.ఈ బహిరంగ సభలో 14 గ్రామాల ఉభయదారులందరూ,గ్రామ పెద్దలు,నాయకులు,యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 30 సంవత్సరాలుగా పరిష్కారం కానీ సమస్యని స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక చొరవతో ఇప్పుడు పరిష్కార దిశగా అడుగులు వేయబోతున్నారని దానికి ఉభయదారులందరూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అతి త్వరలో కానిపాకంలో దళిత సత్రం ఏర్పాటు జరుగుతుందని కార్యక్రమాలు నిర్వహికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 14 గ్రామాల చంద్రప్రభ వాహన ఉభయదారులు, గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామస్తులు,మహిళలు మరియు యూత్ విరివిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాకారుల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
