

Mana News :- దేశంలోనే తొలిసారిగా APలో రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి విడతలో పౌరులకు దేవదాయ, ఎనర్జీ, APSRTC, రెవెన్యూ, అన్న క్యాంటీన్, CMRF, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లోని 161 సేవలు అందించనుంది. త్వరలోనే మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సాప్‌లోనే ప్రభుత్వ సేవలు పొందుతారని సీఎం చంద్రబాబు చెప్పారు.