

తవణంపల్లి జనవరి 13 మన న్యూస్
సమాజంలో చక్కని సేవలు అందిస్తున్న వారికి చిత్తూరు శ్రీ నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఎం.వి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ వారి తరఫున పురస్కారాలను ప్రధానం చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలానికి చెందిన ఎ. అనంత కుమార్ విద్య, సామాజిక, సేవా రంగంలో గత 20 ఏళ్లుగా నిత్యం సమాజ శ్రేయస్సు కాంక్షించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు వారిని గుర్తించి పురస్కారాన్ని అందించడం జరిగింది. అనంతరం అనంత కుమార్ మాట్లాడుతూ విద్య, సామాజిక సేవ జర్నలిజంలో భాగంగా సేవ ను గుర్తించి ఎం.వి కేశవరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మరియు ముఖ్య అతిధులు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మనవడు ప్రముఖ పారిశ్రామికవేత్త, సుబ్రహ్మణ్యం శర్మ, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేయడం జరిగిందని. ఈ సేవా పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.