

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు:కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు స్థానిక గవర్నమెంట్ హైస్కూల్ ప్రాంగణంలో ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం నేతృత్వంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడాపోటీలలు రెండవ రోజు నిర్వహించారు.ఆహ్లాదకర వాతావరణంలో సాంప్రదాయ బద్దంగా జరిగిన కబడ్డీ పోటీల్లో ప్లేయర్స్ ని మాజీ రవాణా శాఖ ఉద్యోగి మిద్దెం చిన్నారావు పరిచయం చేసికుని కబడ్డీ పోటీలను తిలకించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు వలన మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో ప్రజలు కుటుంబ సభ్యులతో గడుపుతూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని అన్నారు.సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ క్రీడా పోటీలకు సహకరించిన పోలీస్ శాఖకి అయన అభినందనలు తెలిపారు.