

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లారాజోలి బండ ఆనకట్టను సందర్శించిన సంకాపురం రాముడు, ఇతర ex, ప్రజాప్రతినిధులు.అలంపూర్ రైతాంగం యాసంగి పంటకు సాగునీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు.బుధవారం ఉదయం ఒక TMC నీటిని అధికారులు విడుదల చేశారు. ఆనకట్ట నుండి 100మీటర్లు దూరం RDS కాలువకు ఉన్న 3 వెంట్ల ద్వారా నీరు వృధాగా బయటికి వెళుతున్నాయి.TMC నీటిలో దాదాపు 30 శాతం వృధాగా మళ్ళీ నదిలోకి కలుస్తున్నాయి.తక్షణమే జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ స్పందించివృధాగా సాగునీరు పోతున్న మూడు వెంట్లను మూయించి అలంపూర్ నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందేలా చూడాలని అయిజ మాజీ సింగల్ విండో అధ్యక్షుడు సంకాపురం రాముడు,మాజీ జెడ్పిటిసి పులికల్ చిన్న హనుమంతు, మాజీ ఎంపిటిసి టీటి దొడ్డి ఉమేష్ గౌడ్,మాజీ సర్పంచ్ నౌరోజీ క్యాంపు భద్రయ్య,మాజీ నీటిసంగం నాయకుడు బ్రహ్మయ్య లు కోరుతున్నారు