

మన న్యూస్:పినపాక,సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చెయ్యాలని పినపాక మండలానికి చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్నో ఏళ్ల నుండి సేవలు చేస్తున్నామని,ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోవాలని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నో వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపించారు.సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయడం ప్రభుత్వానికి పట్టదా అని అన్నారు.సమగ్ర శిక్ష ప్రైవేటు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ప్లై కార్డులు, చీపుర్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో రమణ,సర్వేశ్వరరావు,సాయికుమార్ మొదలైన సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.