నెల్లూరు, మన ధ్యాస, నవంబర్ 26 : నెల్లూరు నగరం,పొగ తోట, కస్తూరి దేవినగర్ లో డాక్టర్ కీర్తి ఐ క్లినిక్ గురువారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాకమూడి కీర్తిక మాట్లాడుతూ…. నేను ఎంబిబిఎస్ ఎంఎస్ ( ఆప్తమాలజీ) చేశాను. ఎవరికైతే కళ్ళు ఏర్పడడం, శుక్లాలు, పొరలు, చూపు మసకబారడం వంటి సమస్యలు ఉంటే కీర్తిక ఐ క్లినిక్ విచ్చేయండి అని తెలియజేశారు. ప్రతి శుక్రవారం ఫ్రీ గా ఓపి చూడబడును అని తెలిపారు.కీర్తిక ఐ క్లినిక్ ప్రత్యేకతలు… కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు చేయబడును, మా వద్ద అన్ని రకాల కంటి అద్దాలు లభించును. నీటి కాసులు వ్యాధికి ప్రత్యేక పరీక్షలు చేయబడును.కుట్లు లేకుండా అత్యాధునిక పద్ధతులలో ఆపరేషన్లు చేయుట, శుక్లానికి ఫ్యాకో ఎమల్ఫికేషన్ ద్వారా ఆపరేషన్ చేయబడును. కంటి రెప్పల జబ్బులకు ప్రత్యేక చికిత్స చేయబడును. కాంటాక్ట్ లెన్స్ మరియు కాస్మాటిక్ లెన్స్ అమర్చబడును. ప్రమాదవశాత్తు జరిగిన గాయాలకు అత్యవసర చికిత్స చేయబడును. మధుమేహం రక్తపోటు ఉన్నవారికి ప్రత్యేక పరీక్షలు చేయబడును అని తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవలో మాజీ శాసనసభలు కొమ్మి లక్ష్మయ్య నాయుడు, ప్రముఖ వైద్యులు, డాక్టర్ కీర్తిక భర్త అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.







