MANA NEWS, MANA DHYASA :– కార్వేటి నగరం మండలం అన్నూరు పంచాయతీ ఎంపీటీసీ ని, సర్పంచ్ నీ గెలిపించి మాజీ సర్పంచ్ (ఆదామ్) సుందర్ రాజా సత్తా చాటుకున్నారు. స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికలలో భాగంగా అన్నూరు, పాదిరి కుప్పం రెండు గ్రామాలు కలిపి సుమారు 2500 పైగా ఓట్లు ఉన్నాయి. టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా పద్మ దానివేలు పార్టీ ప్రకటించింది. ఈ ఎంపీటీసీ స్థానానికి వైసీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మాజీ సర్పంచ్ సుందర్ రాజా ఆదాం సహకారంతో 335 ఓట్ల తో మండలంలోని మెజారిటీతో గెలిపించి సత్తా చాటుకున్నారు. కొందరు ఆ పార్టీ నేతలే టిడిపి అభ్యర్థి కి కాకుండా వైసిపికి ఓటు వేయమని ప్రచారం చేసినట్లు అప్పట్లో గుసగుసలు కూడా వినిపించాయి.. పంచాయతీలో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్, ఎంపీపీ నిధి బలపరిచిన అభ్యర్థిని మాజీ సర్పంచ్ సుందర్ రాజా ఆదాం సహకారంతో ఎంపీటీసీని గెలిపించుకున్నారు.. అదేవిధంగా స్థానిక సంస్థల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో భాగంగా అన్నూరు పంచాయతీకి సర్పంచ్ గా పోటీ చేసే రిజర్వేషన్ ఎస్టీ వర్గానికి కేటాయించారు. దీంతో మాజీ సర్పంచ్ ఆదాం శెట్టిగుంట గ్రామానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తిని నామినేషన్ దాఖలు చేయించారు. సర్పంచ్ స్థానానికి వేరే ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఏకీగ్రీవంగా చిరంజీవి ఎన్నికయ్యారు. దీంతోపాటు పది వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు. కార్వేటినగరం మండలం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు సొంత మండలం సొంత పంచాయతీ. ఇందులో ఎంపీటీసీని, సర్పంచ్ రెండు స్థానాలను టిడిపి పార్టీ కైవసం చేసుకున్నారు. మాజీ సర్పంచ్ సుందర్ రాజా ఆదాం ప్రత్యేక చొరవ తీసుకొని అన్నూరు పంచాయతీలో ఇద్దరు అభ్యర్థులను గెలిపించడంతో మండలంలోనే రాజకీయ చరిత్రను తిరగరాసిన నేతగా నిలిచిపోయారు. గతంలో ఇదే అన్నూరు పంచాయతీ నుండి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఈ పంచాయతీ నుండే గెలుపొందారు. అలాంటి పంచాయతీలో రెండు పార్టీలలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ మాజీ సర్పంచ్ సుందర్ రాజా ఆదాం తనదైన శైలిలో తమ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటుకున్నారు… టిడిపి పార్టీ ఎంపీటీసీ పోటీలో గెలుపొంది , సర్పంచ్ ఏకగ్రీవం అవడంతో పలువురు మాజీ సర్పంచ్ ఆదామ్ ను అభినందిస్తున్నారు. ఈ గెలుపును ఎమ్మెల్యేకు కానుకగా ఇచ్చారు.

