ఏర్పేడు, నవంబర్ 13: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం, మడిబాక గ్రామ పంచాయతీ పరిధిలోని రాజుల కండ్రిగ గ్రామానికి చెందిన విద్యార్థిని గుండ్రాజు దీక్షత తన దయాగుణంతో అందరి మనసులను గెలుచుకుంది.
శుక్రవారం తన ఇంటి వద్ద నీరసించి, చనిపోయే స్థితిలో పడి ఉన్న ఒక పక్షిని దీక్షత గమనించింది. వెంటనే చలించిపోయిన ఆ చిన్నారి, తన వద్ద ఉన్న వాటర్ బాటిల్‌తో ఆ పక్షికి నీరు తాగించి, తగిన సపర్యలు చేసింది. విద్యార్థిని చేసిన తక్షణ సేవతో ఆ పక్షి తిరిగి కోలుకుని ప్రాణాలతో బయటపడింది. చిన్న వయసులోనే మూగజీవి పట్ల దీక్షత చూపిన ఈ ప్రేమ, మానవత్వం పట్ల గ్రామస్తులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.
