నిజాంసాగర్, అక్టోబర్ 2 (మన ధ్యాస) , నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్ పటేల్ గురువారం తూకం చేసి ధాన్యం కొనుగోలును ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని సర్పంచ్ సూచించారు.
ఈ కార్యక్రమంలో: ఉపసర్పంచ్ మెంగారం కవిత పండరి, ఐకేపీ సీసీ చీను, పంచాయతీ కార్యదర్శి భారతి తదితరులు పాల్గొన్నారు.