మన ధ్యాస, మక్తల్: పట్టణం లో మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా మక్తల్ పట్టణం లో గల స్థానిక పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులు వితరణ చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజ చేసి నదిలో, చెరువులో నిమజ్జనం చేయడం వలన ఏలాంటి హాని జరగదని, అలాకాకుండా రసాయన పదార్థాలతో, రంగురంగుల కలర్లతో వినాయక ప్రతిమలు పెట్టి పూజ చేయడం వలన నిమజ్జనం చేసినప్పుడు నీటిలో రసాయన పదార్థాలు కలిసి పంట నీరు పాడు అయి, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అవగాహన కల్పిస్తూ..వాసవి క్లబ్ సభ్యులు మట్టి వినాయకులను వితరణ చేయడం జరిగింది.గణపతి పూజ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని, వినాయక చవితి నాడు పండ్లు, పూలు, ఫలహారం పెట్టి పూజ చేయడం వలన అందరు ఆరోగ్యం గా, ఆహ్లాదంగా ఉంటారని వాసవి క్లబ్ పెద్దలు ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మాజీ డిప్యుటీ గవర్నర్ కల్వ శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షులు మేడిశెట్టి హరికృష్ణ, దొంత లక్ష్మణ్, గురు స్వామి, కల్వల్ నర్సింహా, కల్వల్ రవి కుమార్, రాకేష్, మామిళ్ళ పృథ్వీ, యల్ల లింగ,శివరాం, అశోక్ గురు స్వామి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *