మక్తల్ , మన ధ్యాస: నియోజక వర్గంలోని మాగనూరు మండలం గజరందొడ్డి గ్రామ శివారులోని పామాయిల్ తోటలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ఫోర్స్, మాగనూర్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.46,400 నగదు, 11 సెల్ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు, 104 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు.అదుపులోకి తీసుకున్న వారి వివరాలు:1. మూర్తి, సత్యారం గ్రామం, మక్తల్ మండలం2. ఆనంద్, చిట్యాల గ్రామం, మక్తల్ మండలం3. గంప ఎల్లప్ప, మండిపల్లి గ్రామం, మాగనూరు మండలం4. గోలం అంజప్ప, మండిపల్లి గ్రామం, మాగనూరు మండలం5. తాయప్ప, పంచదేవ్పహాడ్ గ్రామం, మక్తల్ మండలం6. ఫరూక్ పాషా, మండిపల్లి గ్రామం, మాగనూరు మండలం7. రమేష్, చిట్యాల గ్రామం, మక్తల్ మండలం8. వెంకటేష్, ఖానాపూర్ గ్రామం, మక్తల్ మండలం9. ఉమాశంకర్, చిట్యాల గ్రామం, మక్తల్ మండలం, నారాయణపేట జిల్లాఈ సందర్భంగా మాగనూరు ఎస్సై అశోక్ బాబు మాట్లాడుతూ.. పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేకాట ఆడుతున్న వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు.