తవణంపల్లి, సెప్టెంబర్ 3 – మన ద్యాస (నాగరాజ సరకింటి):

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైసీపీ జిల్లా కార్యదర్శి ఏ. కిషోర్ రెడ్డి అన్నారు. వైయస్సార్ ఆశయాలను కొనసాగించేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.వైయస్సార్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీలో వైసీపీ మండల మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరమ్మ, వైసీపీ జిల్లా కార్యదర్శి ఏ. కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, గజమాలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైయస్సార్ సేవలను, ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు.కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వైయస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *