. మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 9 : నెల్లూరు నగరం,టౌన్ హాల్లో ఆదివారం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డిఎస్పి శ్రీనివాసరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… విద్యార్థులకు క్రమశిక్షణ తో జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లేందుకు లక్ష్యంతో చదవాలి అని అన్నారు.చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలిపారు. అనంతరం కాలేజీ ప్రిన్సిపాల్ సరితా రెడ్డి మాట్లాడుతూ……. ఈరోజు ఫ్రెషర్స్ డే చేయడానికి కారణం కొత్తగా చేరిన విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణతో కూడిన కమ్యూనికేషన్ స్కిల్స్ అందించుటకు ఫ్రెషర్స్ డే వేడుకలు చేస్తున్నాము అని అన్నారు. అలాగే మంచి భవిష్యత్తు అందించేందుకు ఫౌండేషన్ తో కూడిన విద్య అందిస్తాము అని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,కాలేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *