మన ధ్యాస ,నిజాంసాగర్: జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ జయ ప్రదీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రపు వెంకటేశం, డాక్టర్ నారాయణ, గౌస్ పటేల్, రామకృష్ణ, అజ్జం దుర్గయ్య, మోయిన్, రాములు, శేఖర్, బాబు, వినోద్, సాయిలు, కిష్టయ్య, మల్లయ్య, ప్రవీణ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.