మన న్యూస్: శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో భక్తుల సౌకర్యార్థం ఆలయములో అభివృద్ధి దాతల సహకారముతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు శ్రీ సత్యనారాయణ వ్రత మండపములో గ్రానైట్ ఫ్లోరింగ్ వేయుటకు దాత ఆకుల ముకేష్ కుమార్,విశ్వనాథ ఆలయములోపల గ్రానైట్ ఫ్లోరింగ్ వెయుటకు దాత గూడూరు సంజయ్ ఆలయములో నీటి సౌకర్యం కల్పించుటకు నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ టాంకు నుండి దేవస్థానము అంతటా అవసరమైన చోట్లలో నీటి సరఫరాకై అవసరమగు పైపు లైన్ ఏర్పాటుకు అంకం సోమలింగం గౌడ్ ఆలయములోని హోమ శాలలొ గ్రానైట్ ఫ్లోరింగ్ వేయుటకు దాత వై. శ్రీనివాస్ రెడ్డి , ఈ దాతల సహాయంతో పనులు మొదలు పెట్టినట్టు ఆలయకార్యనిర్వహణాధికారి ఎన్. లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానము తరపున దాతలకు శ్రీ స్వామివారి ప్రసాదములు అందించి, శేష వస్త్రములతో సత్కరించి వేద పండితులతో ఆశీర్వచనం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు ఆలయ వేద పండితులు రాచర్ల చంద్రకాంత్ శర్మ,పవన్ కుమార్,అర్చకులు కందాల సంతో ష్ కుమార్, అంబయ్య ,జి శ్రీనివాస్,. సిబ్బంది వెంకటయ్య, జి. రమాదేవి, టి. వేణు గోపాల్, తదితరులు పాల్గొన్నారు