చిన్నారికి వైద్య ఖర్చుల కోసం వెంటనే ₹10,000 ఆర్థిక సహాయం అందజేత..
ఉదయగిరి, జూలై 29, జులై 29, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
ఉదయగిరి మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన తుపాకుల మంజుల కుమారుడు తుపాకుల అన్వేష్ లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న నేపథ్యంలో, ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు ని కలిసి తమ సమస్యను వివరించారు.అతి చిన్న వయసులోనే చిన్నారి అన్వేష్ లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న బొల్లినేని వెంకట రామారావు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని, ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా చిన్నారి వైద్య చికిత్స కోసం వెంటనే 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు.చిన్నారి అన్వేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించిన బొల్లినేని వెంకట రామారావు కి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఆయన వెంట వరికుంటపాడు మండల మాజీ అధ్యక్షులు సుంకర వెంకటాద్రి, అంజనాద్రి, చండ్ర ఉమా, చండ్ర వెంకయ్య కామేపల్లి వెంకటరత్నం, కాకి ప్రసాదరావు, పావులూరి రవి, ఆండ్రా నాగిరెడ్డి, గొడుగులూరు రాయుడు, నూనె ప్రసాద్,మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు,
