వరికుంటపాడు జులై 29, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

వరికుంటపాడు మండలం మాజీ మండల అధ్యక్షులు సుంకర వెంకటాద్రి, శ్రీమతి సృజన ఆహ్వానం మేరకు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు వరికుంటపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వరికుంటపాడు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు బొల్లినేని వెంకట రామారావు కి ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీ సాయినాథుని ప్రార్థించినట్లు తెలిపారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, నిర్వాహకులను అభినందించారు. గురు పౌర్ణమి వంటి ఆధ్యాత్మిక వేడుకలు సమాజంలో భక్తి, సేవాభావం, సత్సంకల్పాలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన వెంట సుంకర అంజనాద్రి చంద్ర ఉమామహేశ్వరరావు చంద్ర వెంకయ్య, కామేపల్లి వెంకటరత్నం,కాకి ప్రసాద రావు, పావులూరి రవీంద్ర, గొడుగులూరి మాలకొండ రాయుడు, నూనె ప్రసాద్ గూడూరు రామచంద్రారెడ్డి, స్వర్ణ కొండయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *