తిరుపతి నగరంలోని టౌన్ క్లబ్ కూడలిలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. గాంధీ రోడ్డు నాలుగు కాళ్ల మండపం నుంచి టౌన్ క్లబ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. టౌన్ క్లబ్ కూడలిలో ఏర్పాటు చేసిన డాలర్స్ దివాకర్ రెడ్డి భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు.మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల సందర్భంగా సుమారు 3 వేల మందికి మాంసాహార భోజనాలను ఏర్పాటు చేసి పంపిణీ చేశారు.వేడుకల్లో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ర్యాలీతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసా రత్నం,కోడూరు బాలసుబ్రమణ్యం, ఆర్ సి మునికృష్ణ,బుల్లెట్ రమణ, బిజికే యాదవ్,రేవతి, కూటమి నాయకులు, కార్యకర్తలు దివాకర్ రెడ్డి అభిమానులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


