కావలి జులై 15 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కావలి లో యు.టి. ఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రశాఖ ఆదేశాలు మేరకు మన యు.టి.ఎఫ్. సంఘం చేసిన ఎన్నో పోరాటాలు ఫలితంగా డీఎస్సీ 2003 వారు 2005 సంవత్సరంలో జాయిన్ అయిన ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు సి.పి.ఎస్ నుండి ఓ.పి.ఎస్.గా మార్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.నెంబర్ 53 రిలీజ్ చేసిన సందర్భంగా మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యదర్శి ఐ. హెచ్.ఎల్. ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కోసి సంబరాలు నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో కావలి ప్రాంతీయ మండలాల నాయకులు, జిల్లా కౌన్సిలర్స్, సీనియర్ లు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *