వింజమూరు, జూలై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా సీఈఓ & జిల్లా పంచాయతీ అధికారి డి. వసుమతి నీ ఏపీజేఏసీ వింజమూరు తాలూకా చైర్మన్ మరియు ఏపీఎన్జీజీఓ’ అధ్యక్షులు వెలుగోటి మధు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా పరిధిలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు పరిపాలనా అంశాలపై సానుకూలంగా చర్చించినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.జిల్లా సీఈఓ డి. వసుమతి మాట్లాడుతూ, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని సూచించినట్లు సమాచారం.మర్యాదపూర్వక భేటీ సందర్భంగా వెలుగోటి మధు జిల్లా సీఈఓకు శుభాకాంక్షలు తెలియజేసి, ఉద్యోగుల సంక్షేమం, ప్రజాసేవల మెరుగుదలకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *