జలదంకి, నవంబర్ 3 మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.
నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.జలదంకి మండలంలో ఎస్ఐ వీరేంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు *20 క్వింటాళ్ల రేషన్ బియ్యం* ఉన్నట్లు గుర్తించారు. బియ్యాన్ని నల్ల బస్తాల్లో దాచి, పైన నల్లటి టార్పాలిన్ కప్పి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.వెంటనే వాహనాన్ని సీజ్ చేసి జలదంకి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ బియ్యం పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం కావడంతో, దీని వెనుక పెద్ద అక్రమ రవాణా ముఠా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు ఎస్ఐ వీరేంద్రబాబు తెలిపారు.
