ఐటీ మహిళల ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’పై పరిశోధనకు డాక్టరేట్..
నిరంతర శ్రమ, మేధస్సే సతీమణిని డాక్టర్ చేసింది: చీర్ల కిరణ్ ఆనందం..
ఆచార్యులకు ధన్యవాదాలు తెలిపిన చీర్ల కిరణ్…
టీటీడీ అసోసియేషన్ల శుభాకాంక్షలు…
రేణిగుంట/తిరుపతి
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ స్టడీస్ ( ఎంబీఏ ) విభాగంలో పరిశోధన పూర్తి చేసిన ఎం.బి. జ్యోతి (ఎం .బి . జ్యోతి ) కి విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ( పీహెచ్డీ ) డిగ్రీని ప్రదానం చేసింది. ఆమె “ఏ స్టడీ అఫ్ వర్క్- లైఫ్ బాలన్స్ అఫ్ ఉమెన్స్ ఐటీ ప్రొఫెషనల్స్ ఇన్ బెంగళూరు సిటీ ” అనే అంశంపై తన పరిశోధనా గ్రంథాన్ని సమర్పించారు. ఇటీవల నిర్వహించిన వైవా- వాయిస్ పరీక్షలో ఆమె ప్రదర్శించిన ప్రతిభను పరిశీలించి, విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి. రాజమాణిక్యం ఆమెను డాక్టరేట్ పట్టాకు అర్హురాలిగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ మాట్లాడుతూ.. తన సతీమణి జ్యోతి చిన్నతనం నుంచే చదువుల తల్లిగా నిలిచిందని, ఆమెకు అపారమైన మేధస్సు, జ్ఞాపకశక్తి ఉన్నాయని కొనియాడారు. ఆమె నిరంతరం శ్రమించి ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. తన సతీమణి పిహెచ్డి సాధించడంలో నిరంతరం ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించిన పరిశోధనా పర్యవేక్షకులు ప్రొఫెసర్ డి.వి. రమణ (రిటైర్డ్), కో-రీసెర్చ్ సూపర్వైజర్ ప్రొఫెసర్ పి. రఘునాథరెడ్డిలతో పాటు వైవాలో పాల్గొన్న ప్రొఫెసర్ ఆర్ . శివరామ్ ప్రసాద్, ప్రొఫెసర్ పి . మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ ఎం . వెంకటేశ్వర్లు తదితర ప్రొఫెసర్లందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
చీర్ల కిరణ్ సతీమణి జ్యోతికి డాక్టరేట్ ప్రదానం కావడం పట్ల టీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, వర్సిటీ అధ్యాపకులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

