పూతలపట్టు జూలై 1 మన ధ్యాస (నాగరాజ సరకింటి )

పూతలపట్టు మండలం, పేటమిట్టలోని మంగళ్ విద్యాలయం విద్యార్థులు ఎంసెట్ –2026 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరోసారి పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు.ఈ సంవత్సరం నిర్వహించిన ఎంసెట్ –2026 పరీక్షలో మంగళ్ విద్యాలయం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 994 ర్యాంకు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. అదేవిధంగా పలువురు విద్యార్థులు 2788, 3175, 3506, 5793, 7866, 8210 రాష్ట్ర ర్యాంకులను సాధించి ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు.విద్యార్థులు సాధించిన ఈ ఘన విజయం వారి నిరంతర శ్రమకు, అధ్యాపకుల అంకితభావానికి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి నిదర్శనంగా నిలిచింది.ఈ సందర్భంగా మంగళ్ విద్యాలయం వ్యవస్థాపకులు డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ కుటుంబానికి, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే విద్యార్థుల విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందాన్ని, సహకరించిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ విజయంతో మంగళ్ విద్యాలయం మరోసారి నాణ్యమైన విద్యకు, ఉత్తమ ఫలితాలకు చిరునామాగా నిలిచిందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *