మన న్యూస్:శ్రీకాళహస్తి ప్రజల పక్షాన నిలబడి విశాలాంధ్ర జాతీయ దినపత్రిక పోరాటం చేస్తోందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలోని తన స్వగృహంలో విశాలాంధ్ర దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం ఎమ్మెల్యే అవిష్కరించి మాట్లాడారు. 2022,23,24, నుంచి వరుసగా ఇప్పుడు నాలుగో సారి కూడా ఈ పత్రిక క్యాలెండర్ ను అవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యకాండలపై విశాలాంధ్ర జాతీయ దినపత్రిక అలుపెరగని పోరాటం చేసిందని కొనియాడారు. అప్పుడు ఇప్పుడూ వాస్తవాలను ప్రచురిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారదిగా నిలుస్తోందని చెప్పారు. రాజకీయ అంశాలతోపాటు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తూ వాటి పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలిసో తెలియకో జరిగే తమ తప్పులను కూడా చూపిస్తూ సరిద్దిద్దుకోవడానికి అవకాశం కల్పిస్తోందన్నారు. ఇటువంటి ప్రజా పత్రిక విశాలాంధ్ర క్యాలెండర్ అవిష్కరణలో తనను భాగస్వామ్యం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. విశాలాంధ్ర పత్రిక యాజమాన్యానికి, పనిచేస్తున్న జర్నలిస్టులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితా రెడ్డి ఈ క్యాలెండర్ అవిష్కరణలో పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, టీడీపీ నాయకులు లక్కమనేని మధుబాబు, ఎక్స్ కౌన్సిలర్ రవీంద్రబాబు ,టిడిపి యువనేత సాలపాక్షి నవీన్, విశాలాంధ్ర జాతీయ దినపత్రిక నియోజకవర్గ పాత్రికేయులు డాక్టర్ కోటేశ్వర బాబు, వలిపి శ్రీరాములు, వెంకట కిషోర్, గాలి రవి, తదితరులు పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *