మన ధ్యాస నెల్లూరు, జూన్ 21 : నెల్లూరు జిల్లా వడ్డెర సంఘ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం నెల్లూరు నగరం దర్గామిట్ట, అంబేద్కర్ భవన్లో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షురాలు మల్లి నిర్మల విచ్చేశారు. నెల్లూరు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడుగా గోపి ఎన్నికయ్యారు. వడ్డెర సంఘం జాతీయ మహిళల అధ్యక్షురాలు మల్లి నిర్మల మాట్లాడుతూ…..జాతీయ ప్రయోజనం కోసం రాజకీయ పార్టీల అతీతంగా తమ పోరాటం ఉంటుందని తెలియజేశారు.కమిటీ అవసరాల కోసం ఒక భవన అవసరం ఉంటుంది…దీనికి అధ్యక్షుడు గోపి స్థల సేకరణ చేసి, అందరి సహకారంతో భవనం నిర్మించవలసినదిగా ఆమె కోరారు.ఈ కార్యక్రమానికి వడ్డెర సంఘం జాతీయ రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ళ మురళి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాసులు,నేషనల్ చీఫ్ అడ్వైజర్ గుడ్డి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.నూతన అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వడ్డెర సంఘం అభివృద్ధికి తన సాయశక్తుల ప్రయత్నిస్తానని…. సంఘం భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని తెలిపారు.అధ్యక్షుడిగా నన్ను ఎనుకున్నందుకు సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *