మన ధ్యాస,నెల్లూరు, జాన్ 21 :నెల్లూరు నగరంలోని కస్తూరి దేవి కళాక్షేత్రంలో ఆదిదారం ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ వారు ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డాక్టర్ వంగిపురం శంకర్, డాక్టర్ చిరమణ హరిత, ఆర్ఐఓ వరప్రసాదరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు పాటలు, నృత్యాలు, ఆటలతో అలరించారు.ఈ సందర్భంగా ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ ఫౌండర్, చైర్మన్ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు నూతన విద్యార్థులను ఆహ్వానించడంతో పాటు వారి భవిష్యత్తుపై చర్చించడం జరిగిందన్నారు. గత సంవత్సరం కాలేజీ నుండి 465+ మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులు, బైపీసీలో 449 మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నారని గుర్తు చేశారు.అనుభవజ్ఞులైన లెక్చర్లతో నాణ్యమైన బోధన అందిస్తున్నామని, ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్న ఆర్ఎన్ఆర్ కాలేజీలో విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని భరోసా ఇచ్చారు. చదువుతో పాటు ఆటపాటలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.ఈ సంవత్సరం కొత్తగా ఆర్ఎన్ఆర్ స్కూల్‌ను ప్రారంభించామని, రాబోయే సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీని కూడా ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 450 మార్కులు పైబడిన విద్యార్థులకు రెండో సంవత్సరం ఎలాంటి ఫీజులు లేకుండా ఉచిత విద్య అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు,ముఖ్య అతిథులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *