- ప్రభుత్వ విప్ గణబాబు.
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం గోపాలపట్నం జూన్ 17:విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి (SSC) ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన విద్యార్థులను విశాఖ పశ్చిమ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ గణబాబు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సీట్లు సాధించిన విద్యార్థులు మరియు వారి పాఠశాలల వివరాలు: కొత్తపాలెం హైస్కూల్: బి. నిత్య,గోపాలపట్నం బాలికల హైస్కూల్ ఎ. స్రవంతి, ఎల్. భువన సాయి,ఆర్.ప్రవల్లిక, ఎల్. లేఖ, జి. భవ్యశ్రీ గోపాలపట్నం హైస్కూల్ ఎన్. హర్షవర్ధన్, ఎ. కృపాకర్,కె. పల్లవి శ్రీహరిపురం జీవీఎంసీ హైస్కూల్ బి. సత్యపూజిత,ఎం.వర్షిణి,ఉడి మేఘన శ్రీ మల్కాపురం హైస్కూల్ ఆడారి ప్రణవి ఆర్పీ పేట హైస్కూల్ కత్తిరి లోహిత ఈ విద్యార్థులు నూజివీడు, శ్రీకాకుళం,ఒంగోలు,ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో సీట్లు సాధించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గణబాబు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కష్టపడి చదివి, ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించడం ఎంతో గర్వకారణమని కొనియాడారు.పేదరికాన్ని జయించి,ఇంతటి ఘన విజయాలు సాధించిన విద్యార్థుల భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయులను,ఉపాధ్యాయులను మరియు విద్యార్థుల తల్లిదండ్రుల కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ సన్మాన కార్యక్రమంలో ఎంఈవో,పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
