మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం జూన్ 14:విశాఖ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌గా కొనసాగించాలని విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు గుంటూరు వెంకట నరసింహారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.విశాఖలోనే విమానాశ్రయాన్ని కొనసాగించాలన్నారు.అన్ని జిల్లాలో విమానాశ్రయాలు వున్నాయిని దేశంలో చాలా ఎయిర్ పోర్టుల్లో నేవీ సివిల్ , తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయిని పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో విమానాశ్రయాన్ని మూసివేయాలని నిర్ణయించడం సరికాదన్నారు.విశాఖను కనుమరుగు చేసే పరిస్థితి తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా ఎయిర్ పోర్టు ఉండాల్సిందే నన్నారు అది విశాఖ ప్రజల కోరిక అని తెలిపారు.నగరానికి60 కిలోమీటర్లు దూరంలో ఉండడం వలన ప్రయాణికులు సకాలంలో చేరుకోవడం ఇబ్బందిగా ఉంటుందన్నారు. నగరంలోనే ఉండటంతో ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.మంత్రులు,ఎమ్మెల్యే లు,మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరు ఏకాత్రాటిపైకి వచ్చి ఎయిర్ పోర్టు ఇక్కడే ఉండాలని ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలన్నారు.ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తప్ప ఎవరు స్పదించడం లేదన్నారు.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను స్వాగత స్తున్నామని అక్కడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను అక్కడ నుంచి నిర్వహించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *