

మన న్యూస్:తిరుపతి జనవరి 8వ తారీఖున శ్రీశైలం పుణ్యక్షేత్రంలో రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సభను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతిలో ఆయనను ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు రుద్రరాజు శ్రీదేవి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు సిరిగిరి శంకర్ రాజు, ఆనంద రాజు, సుధాకర్, గొర్రె బ్రహ్మం, రామచంద్రుడులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి నెలలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామ రథయాత్రను వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా జనవరి 8న శ్రీశైలంలో, జనవరి 19న డెహ్రాడూన్ లో ఆధ్యాత్మిక సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాయలసీమ జిల్లాలలో రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ప్రతినిధులను నియమించి ప్రణాళికబద్ధంగా క్షేత్రస్థాయిలో హిందూ సనాతన ధర్మాన్ని తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.తనను కలిసి సన్మానించిన సుకుమార్ రాజు, శ్రీదేవి, శంకర్ రాజు, వెంకటేశ్వర్లను అభినందించారు.