మద్యాస ప్రతినిధిపాచిపెంట, మే 17:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా పాచిపెంట మండలం పి కోనవలస విచ్చేసారు. ఆదివారం నాడు ఆయనను పార్వతిపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాకు జిల్లా ఎస్పీ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక మొక్కను అందజేసి, జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున అభినందనలు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రత ఏర్పాట్లు మరియు పలు పోలీస్ సంబంధిత అంశాలపై ఈ సందర్భంగా కాసేపు చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *