మనధ్యాస, బంగారుపాల్యం,మే 8
రిపోర్టర్: కమల్ రెడ్డి.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల పరిధిలోని చీకూరిపల్లి గ్రామం నందు గ్రామస్తులు మహాభారత యజ్ఞంలో భాగంగా అర్జున తపస్సు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్జున తపస్సులో భాగంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి అర్జునుడు తవుసుమాను ఎక్కేటప్పుడు మెట్టు మెట్టుకు పాటలు పాడుతూ భక్తులను ఆకర్షిస్తూ తవసు మానును ఎక్కేటప్పుడ్డు సంతానం పిల్లలు లేనివారు అర్జునుడు తపస్సుమాను నుండి విసిరే బొరుగులు పూలు కోసం సంతానం లేనివారు కొంగుపట్టి సంతానం కోసం మొక్కులు మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరుపల్లె, కాటప్ప గారిపల్లి, కేజీ సత్రం, పామినివాండ్ల ఊరు,చీకురుపల్లి, సి ఆర్ కాలనీ గ్రామస్థులు, యువత,మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.