తిరుపతి నగరంలోని తాజ్ హోటల్‌లో ‘హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్’ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2025-26) సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి లభించాల్సిన ప్రత్యేక సహకారంపై కీలక ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:తిరుపతి కేవలం స్థానిక జనాభా కే కాక, ప్రతిరోజూ లక్షలాది మంది వచ్చే ‘ఫ్లోటింగ్ పాపులేషన్’ (యాత్రికులు) ఉన్న నగరమని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పట్టణ అభివృద్ధి నిధులను సమకూర్చాలని తెలిపారు.

అమృత్ 2.0 పథకం ద్వారా నగరంలో తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడంలో సాధించిన పురోగతిని వివరించారు.

స్వచ్ఛ భారత్ మిషన్ – సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా వ్యర్థాల నిర్వహణ,మెరుగైన పారిశుద్ధ్య యంత్రాలు, చెత్త శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుపై కమిటీ నివేదిక ఇచ్చారు.

పేదలు మరియు సేవా రంగ కార్మికుల కోసం సరసమైన ధరల్లో గృహ నిర్మాణం చేపట్టడం,వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ‘ఆర్గనైజ్డ్ వెండింగ్ జోన్ల’ ఏర్పాటు ద్వారా వారి జీవనోపాధి పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

కాలుష్య రహిత తిరుపతి కోసం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచాలని, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మల్టీ-లెవల్ పార్కింగ్ కేంద్రాల అవశ్యకతను వివరించారు.

కాలుష్య రహిత రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతూ, మెరుగైన పార్కింగ్ మరియు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

తిరుపతి యొక్క వారసత్వాన్ని కాపాడుతూనే, భవిష్యత్ తరాల అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర సుస్థిర అభివృద్ధి చేయడమే తుడా లక్ష్యమని డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సభ్యులు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తుడా వైస్ చైర్మన్,మరియు స్థానిక ఎమ్మెల్యే, తుడా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed