- .మేడే కార్మిక దినోత్సవం ఒకపక్క జీవీఎంసీ ఒత్తిళ్లు ఒకపక్క వెలసి కార్మికుల పని తప్పలేదు…
- 71,76 వార్డుల్లో జీవీఎంసీ అధికారుల ఒత్తిళ్లు..
- ఏమి చేయాలో పాలు పోనీ పారిశుద్ధ్య కార్మికులు…..
- తోటి కార్మికులు పనిచేసిన వైనం

మన ధ్యాస ప్రతినిధి గాజువాక(పెద్ద గంట్యాడ మండలం): మే డే అన్నది శ్రమను గౌరవించే సెలవుతో ఇచ్చే రోజు అని అర్థం.జీవీఎంసీ అధికారులకు మాత్రం శ్రమను దోచుకునే రోజు కిందన ప్రవర్తించిన వైనం. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో సుమారుగా అన్ని వార్డులకు సంబంధించి 1200 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోమని కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. కౌన్సిల్ తీర్మానం లో ప్రకటించినట్టుగా జీవీఎంసీ అధికారులు స్పందించి వార్డుల్లో భర్తీలు చేయడం జరిగింది.గత నెల సుమారుగా అన్ని వార్డుల్లో నుంచి జీపీఎంసీలో పని చేస్తూ మరణంతో,ఇతర అనివార్య కారణాల వలన ఆ పనిని వారి కుటుంబ సభ్యులకు వ్యక్తులకు పని ఇవ్వడం జరిగింది. సుమారుగా 1200 మంది రోజువారీ కూలీ కిందన విధులు నిర్వహిస్తున్నారు.మే ఒకటవ తారీఖున కార్మికుల సెలవు రోజు పూట జీవీఎంసీ అధికారులు,సచివాలయం సిబ్బంది గాని ఎవరు చెప్పారు చెప్పలేదు తెలియదు.కొన్ని వార్డులలో మాత్రం కొత్తగా జాయిన్ అయినా జీవీఎంసీ వర్కర్లు ఈరోజు పని చేయడం జరిగింది.బహుశా తోటి పని చేసిన కార్మికులు (ఔట్సోర్సింగ్ కార్మికులు)గాని అడిగితే అధికారులు,సచివాలయం సిబ్బంది చేయమన్నారని చెప్పారు. సానిటరీ వార్డ్ సూపర్వైజర్ అడిగితే పర్మినెంట్ కార్మికులు (గవర్నమెంట్ ఎంప్లాయిస్)మాత్రమే చేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో ఔట్సోర్సింగ్ కింద కార్మికులు,కొత్తగా జాయిన్ అయినా కార్మికులు గాని పనిచేయట్లేదు ద్వంద వైఖరిలో తెలపడం జరిగింది. ఒకపక్క కార్మికుల దినోత్సవం కూడా యూనియన్ నాయకులు వారి యొక్క రావలసిన హక్కుల పైన కార్మికులకు తెలియజేస్తూ ఉంటే మరొక పక్క అధికారులు మాత్రం వారి చేయవలసిన పనులు మాత్రం చేయిస్తూనే ఉన్నారు.