Mana Dhyasa :- పొన్నలూరు మండలం పరుచూరివారిపాలెం సమీపంలోని జగనన్న కాలనీల్లో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. పొన్నలూరు ఎస్సై సత్యనారాయణ సిబ్బందితో కలిసి దొంగను చాకచక్యంగా పట్టుకొని అతని వద్ద నుంచి హోమ్ థియేటర్, కార్ బ్యాటరీలు, మైక్ సెట్ సంబంధించిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని మార్కాపురం జిల్లా కనిగిరి మండలంకు చెందినకె. మనోహర్ గా గుర్తించామని అన్నారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. అనుమానిత వ్యక్తులు, దొంగలు ఎవరైనా సంచరిస్తుంటే సమాచారం అందించాలని ఎస్సై సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *