తవణంపల్లి ఏప్రిల్ 28 మన ధ్యాస
తవణంపల్లి మండల పరిధిలోని ఎగువ తవణంపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు సామాజిక భాగస్వామ్య బలోపేత కార్యక్రమం నిర్వహించారు. అలాగే తవణంపల్లి పోలీస్ వారు గ్రామస్తులకు చట్టాల పట్ల అవగాహన కల్పిస్తూ, ఆడపిల్లల రక్షణ పట్ల ఎప్పుడు పోలీస్ వారు అందుబాటులో ఉంటారని,ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగిన తక్షణమే పోలీసు వారికి ఫోన్ ద్వారా కూడా తెలియజేయాలని, ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రజల రక్షణ మా బాధ్యతగా సేవలందిస్తామని తెలియజేసారు. గ్రామాలలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగిన పోలీసు వారికి సమాచారం అందించాలని వారు కోరారు. మహిళలు, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సలహాలు సూచనలు ఇవ్వడం, చట్టాల పట్ల అవగాహన చేయడం జరిగింది.