మన ధ్యాస, నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభు త్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని గున్కుల్ ప్రాథమిక సహకార సంఘం ఫంక్షన్ హాల్ లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల చెక్కులను మండలానికి చెందిన లబ్దిదా రులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బూర్గుల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు తర్వాత డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన ప్రజా అవస రాలను తీర్చే విధంగా ఉన్నాయన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు ఫలితం లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్ర మంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,తహసీల్దార్ లత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గంగి రమేష్, ఉపాధ్యక్షుడు సయ్యద్ రఫీ, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు లోక్య నాయక్, సర్పంచులు హరికుమార్, కిరణ్ ,గజ్జల జీవన్, నాయకులు ఆకాష్, నాగభూషణం గౌడ్, నగేష్ సంతోష్ రాథోడ్ , తదితరులు పాల్గొన్నారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *