కలిగిరి మార్చి 28,మన న్యూస్ ప్రతినిధి(నాగరాజు కె )
కలిగిరి మండలం నాగసముద్రం ఎస్సీ కాలనీలో విషాద వాతావరణం నెలకొంది.మార్కాపురం సమీపంలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఆత్మకూరు చిన్నయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకువచ్చారు.మృతదేహాన్ని చూసిన వెంటనే కుమార్తెలు, కుటుంబ సభ్యులు, స్థానికులు బోరున విలపించారు. ఆ దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది.ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ పూసాల వెంగపనాయుడు, నాయకులు బిజ్జం కృష్ణారెడ్డి, సిహెచ్. తాతయ్య, వై. రమణారెడ్డి తదితరులు మృతదేహానికి నివాళులు అర్పించారు.అనంతరం కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున తక్షణ మట్టి ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందజేశారు.మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, పిల్లల చదువులు మరియు భవిష్యత్తు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
