గురుకుల పాఠశాల నందు 110 మంది విద్యార్థులకు బట్టలు పంపిణీ.

బంగారు పాళ్యం, మన ధ్యాస, మార్చి 17. రిపోర్టర్: కమల్ రెడ్డి

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారు పాళ్యం నందు గల గురుకుల పాఠశాల నందు మంగళవారం తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ఆర్టిఐ అధ్యక్షులు జన్నావుల సురేంద్ర ఆధ్వర్యంలో ఆర్టిఐ కమిటీ సంస్థ సభ్యులు తో కలిసి గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటసుబ్బయ్య సమక్షంలో విద్యార్థులకు బట్టల పంపిణీ కార్యక్రమం ను నిర్వహించడం జరిగినది. గిరిజన గురుకుల పాఠశాల నందు ఉన్న మొత్తం విద్యార్థులు సంఖ్య 110 మంది అందరికీ ఉగాది కానుకగా ముందుగా కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర , ప్రిన్సిపాల్ వెంకటసుబ్బయ తో పాటు ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ఆర్టిఐకమిటీ సభ్యులు వెంకటరమణ, జయచంద్ర, రెడ్డప్ప, శంకర్ నాయుడు, ప్రతాప్ కుమార్, శ్రీనివాసులు, హేమచంద్ర, సుందరం, వేణుగోపాల్ నాయుడు, సాంబయ్య, గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు, పాఠశాల సిబ్బంది సంస్థకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *