మన ధ్యాస ప్రతినిధి సాలూరు మార్చి 14:- జనసేన పార్టీ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జర్జాపు సూరిబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్యకర్తల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు కార్యకర్తలు నడుమ జర్జాపు సూరిబాబు కేకును కట్ చేసారు. అనంతరం ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి పార్టీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 2014 లో స్థాపించారన్నారు. 2019లో కూటమి పార్టీకి మద్దతు తెలిపినప్పటికీ ఓటమి చవి చూడక తప్పలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించలేక 2024లో ఓటమిపాలయ్యారన్నారు. పవన్ కళ్యాణ్ విధివిధానాలు నచ్చి మేమంతా పార్టీలో చేరిన దగ్గర నుండి నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఒక గుర్తింపు తెచ్చామన్నారు. అలాగే నాగవంశం రాష్ట్ర వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జర్జాపు దిలీప్ ఆధ్వర్యంలో జనసేన పార్టీకి 200 సభ్యత్వాలు చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో 16 అవార్డు కౌన్సిలర్ రాపాక మాధవరావు, మండవిల్లి కామరాజు, జీటీ నాయుడు, బోనమహంతి శ్రీనివాసరావు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *