కార్వేటినగరం మన ధ్యాస: కార్వేటినగరం మండలంలోని ఎం.యం విలాసం రైతు సేవా కేంద్రంలో పట్టు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిరికల్చర్ జాయింట్ డైరెక్టర్ పద్మమ్మ, సిరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గీత, సిరికల్చర్ ఆఫీసర్ గణేష్, టెక్నికల్ ఆఫీసర్ రమేష్ రెడ్డి, విఎస్ఏ మునికృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు రైతులకు పట్టు పురుగుల పెంపకం పద్ధతులు, పట్టు పురుగులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు, రేరింగ్ గదిలో పాటించాల్సిన నియమాలు వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. అలాగే రేరింగ్ గదిలో ఉష్ణోగ్రత మరియు తేమ స్థాయిలు ఎలా ఉండాలి, మంచి దిగుబడి కోసం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలను వివరించారు.ప్రభుత్వం పట్టు రైతులకు అందిస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని పట్టు సాగును అభివృద్ధి చేసుకోవాలని అధికారులు సూచించారు.
