మన ధ్యాస,ఇందుకూరుపేట, మార్చి9 : 48 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నెల్లూరు – మైపాడు రోడ్డు నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం మంత్రులు మరియు అధికారుల సహకారంతో దాదాపు 50 శాతం పనులు పూర్తి చేయగలిగామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇందుకూరు పేట మండలం డేవిస్ పేట వద్ద యాగర్ల జంక్షన్ వద్ద 1 కోటి 40 లక్షల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఆమె శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ….. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం. అభివృద్ధి సమపాళ్లలో అమలు చేస్తూ సుపారిపాలన అందిస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో ఇందుకూరు పేట మండలంలో 63 కోట్ల వ్యయంతో 227 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు, మరమత్తులు చేశామన్నారు. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ యాక్సిడెంట్ జోన్ గా మారిన డేవిస్ పేట జంక్షన్ లో ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో రోడ్డు ప్రమాదాలు తగ్గు ముఖం పడుతాయన్నారు. నెల్లూరు – మైపాడు రోడ్డుకు సంబంధించి ఇప్పటికే మైపాడు, నర్సాపురం, రావూరు, జగదేవి పేట గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని రోడ్డు విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించారన్నారు. వివిధ శాఖల సమన్వయంతో నుడా సహకారంతో విద్యుత్ స్తంభాల మార్పిడి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రోడ్డు నిర్మాణం పూర్తయితే గంగపట్నం చాముండి అమ్మవారి భక్తులకు మరియు మైపాడు సముద్ర తీరం వెళ్లే పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుందనన్నారు. ధాన్య సేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్ తో చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. గత రబీ సీజన్ లానే ధాన్య సేకరణ చేసిన 48 గంటలలో రైతుల ఖాతాలలో హమాలీ కూలీలతో సహా ప్రభుత్వం చెల్లిస్తుందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హామీ యిచ్చారు. రైతులు, మిల్లర్లు, అధికారులు పరస్పర సమన్వయంతో ధాన్య సేకరణ సజావుగా జరిగేలా చూడాలన్నారు. గత సీజన్లో ట్రాక్టర్లు బకాయిలకు సంబంధించి ప్రభుత్వం 36 లక్షల నిధులు విడుదల చేసిందని బిల్లులు తీసుకొచ్చి రైతులు బకాయిల తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు కూటమి పార్టీల నాయకులు అధికారులు పాల్గొన్నారు.

