మన ద్యాస, నెల్లూరు, మార్చి 4 :నెల్లూరు నగరం విజయ మహల్ గేట్ వద్ద శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలైన భయ్యా వాసు, రవిలా ఆధ్వర్యంలో నూతనంగా హోటల్ విశ్రాంత్ బుధవారం ప్రారంభమైనది. ఈ ప్రారంభ వేడుకలలో ముఖ్య అతిథులుగా మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, జనసేన నాయకులు గునుకుల కిషోర్, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు, భయ్యా వాసు, రవి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు ఈ ప్రారంభ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోటల్ విశ్రాంత్ ప్రారంభానికి వచ్చిన అతిథులు మాట్లాడుతూ…….వస్త్ర వ్యాపార రంగంలో శిఖరాగ్రంగా వెలుగొందుతున్న భయ్యా వాసు,రవి ఇప్పుడు ఆతిథ్య రంగంలోకి అడుగుపెట్టి నెల్లూరు నగరానికి ప్రీమియం సౌకర్యాలతో కూడిన కొత్త వేదికను అందించడం అభినందనీయం అని ఆయన పేర్కొన్నారు. వినియోగదారుల అభిరుచిని అర్థం చేసుకునే వ్యాపార దక్షత కలిగిన భయ్యా వాసు,రవి , ఈ రంగంలో కూడా విజయవంతంగా రాణిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం మాత్రమే కాదు, వాటిని విజయవంతంగా నడిపిస్తూ పలువురికి ఉపాధి కల్పించడం ద్వారా భయ్యా వాసు నెల్లూరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం ముందుండే భయ్యా వాసు కి రానున్న రోజుల్లో మరింత విజయాలు, మరిన్ని శిఖరాలు సాధించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ, వారి ప్రయాణం మరెందరికో ప్రేరణగా మారాలని గునుకుల కిషోర్ ఆకాంక్షించారు. అనంతరం భయ్యా వాసు, రవి మాట్లాడుతూ….. మా హోటల్ విశ్రాంత్ లో అని సౌకర్యాలతో,అందరికి అందుబాటు ధరలలో చిన్న ఫంక్షన్ల్ లకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. మా ఈ హోటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు.




