మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వరుపుల రాజా,తాను అధికారంలో లేకపోయినప్పటికీ, నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత మెడికల్ క్యాంపులు మొదలైన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఎన్నటికీ చెరగని ముద్ర వేశారని,నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అని, ఏలేశ్వరం పి ఏ సి ఎస్ మెంబర్ వైభోగుల సుబ్బారావు యాదవ్ అన్నారు. రాజా తృతీయ వర్ధంతి సందర్భంగా కార్యకర్తలు, అభిమానులతో కలిసి రాజా చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులు అర్పించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తదుపరి జోహార్ వరుపుల రాజా జోహార్అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైభోగుల సుబ్బారావు యాదవ్, వాకాడ కనకరాజు, అక్కరావు, కోరాడ శివ, రేఖ గంగాధర్, సుంకర రాజు, మువ్వల గంగరాజు, కాటమ స్వామి, పల్లి బోయిన సోమరాజు, షేక్ సత్తార్ బాబు, వాకాడ రాజు, కూరాకుల చంటి, కేసనకుర్తి వీరబాబు, పెనుకొండ శ్రీను, సేనాపతి సూర్య ప్రకాష్ తదితర అభిమానులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *