
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం పట్టణంలో, స్థానిక ది లారీ మోటార్ వర్కర్స్ యూనియన్ కళ్యాణ మండపంలో, శ్రీశ్రీశ్రీ లారీ ఓనర్స్ మరియు వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక లాంఛనంగా జరిగింది. ఈ ఎన్నికలో గౌరవ అధ్యక్షులుగా జ్యోతుల రమణ, అధ్యక్షులుగా వాకాడ కనకరాజు, ఉపాధ్యక్షులుగా కేసనకుర్తి వీరబాబు,కార్యదర్శిగా గొర్ల శివ , సహాయ కార్యదర్శిగా కరిమెరకల కృష్ణ , కోశాధికారిగా పోరాబత్తుల సత్తిబాబు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా ఎన్నికైన వాకాడ కనకరాజు మాట్లాడుతూ, కార్యవర్గ ఎన్నిక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇదే ఐక్యత మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలని ఆయన యూనియన్ సభ్యులను అభినందిస్తూ కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ మరిడమ్మ లారీ ఓనర్స్ మరియు వర్కర్స్ యూనియన్ సభ్యులంతా పాల్గొన్నారు.