మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :జాతీయ నులిపురుగుల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నాడు నులిపురుగుల నివారణ టాబ్లెట్లు ఆల్బెండజోల్‌ పంపిణీ చేస్తున్నట్లు యు పి హెచ్ సి వైద్య అధికారిని డాక్టర్ ఎం. సౌభాగ్య సరోజ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఎం సౌభాగ్య సరోజ మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం నగరంలోని ఉన్నత పాఠశాల, అంగన్వాడి సెంటర్లు, ప్రభుత్వ డిగ్రీ, కాలేజ్ జూనియర్ కాలేజ్, ప్రైవేట్ స్కూల్ లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు.43 కేంద్రాల్లో 7253 మంది
విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరందరికీ ఆల్బెండజోల్ వైద్య సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, ద్వారా స్వయంగా బాల బాలికలకు నులిపురుగుల మాత్రలు అందజేసి నివారణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈరోజు నులిపురుగుల నివారణ 98 శాతం పూర్తి చేయడం జరిగిందని.ఈనెల 24 న
రెండో విడతగా పిల్లలకు నులి పురుగులు మాత్రలు వేయించి 100% పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు .ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు,ఏఎన్ఎంలు,అంగన్వాడి టీచర్లు,ఆశాలు, అంగన్వాడి సిబ్బంది, పాల్గొన్నారు,

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *